సమ్మర్ స్పెషల్‌గా విడుదలైన ‘ఎఫ్-3’ అనుకున్నట్లుగానే ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ సక్సెస్ ఫుల్ టాక్‌తో దూసుకుపోతుంది, అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌కు హీరోయిన్ తమన్నా రాకపోవడం.. డైరెక్టర్ అనిల్ రావిపూడి, తమన్నాకు మధ్య గొడవలు జరిగాయని తెగ ప్రచారం జరిగింది. ఆ విషయాలపై తాజా ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చాడు అనిల్.
తమన్నాతో జరిగింది పెద్ద గొడవేం కాదని, ఎఫ్-3’ షూట్ జరుగుతున్న రోజుల్లో ఓసారి.. షూటింగ్ టైమ్ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చిందని, అందుకు తమన్నాను సెట్లోనే ఉండాలని చెప్పామన్నారు. అందుకు తమన్నా.. ‘‘వర్కౌట్లు చేసుకోవాలి. టైమ్ లేదు. వెళ్లిపోవాలి’’ అని చెప్పిందని, దీంతో మా మధ్య రెండు రోజులపాటు వేడి వాతావరణం నెలకొందన్నారు అనిల్ రావిపూడి. ఆ తర్వాత అంతా సద్దుమణిగిందని, మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుకున్నామని చెప్పారు . వేరే సినిమా షూటింగ్స్‌లో ఉండటం వల్ల తమన్నా ప్రమోషన్స్‌కు రాలేకపోయిందన్నారు. ‘ఎఫ్-3’ని సక్సెస్ ను తాను బాగా ఎంజాయ్ చేస్తున్నాననంటూ చెప్పారు.