Director Anudeep Suffering From Highly Sensitive Disorder Disease
mictv telugu

నవ్వుల వెనుక నరకం.. అనుదీప్ కి భయంకర వ్యాధి.. మందులేని మాయరోగం..!

November 3, 2022

సమంత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతుందని తెలిసిన ప్రతి ఒక్కరు చలించిపోయారు. సెలబ్రెటీలు, ఫాన్స్ , నెటిజన్స్ అంత కూడా సమంతకి సంఘీభావం చెప్తున్నారు. ఇంతలోనే టాలీవుడ్ లో మరో షాకింగ్ న్యూస్. జాతిరత్నాలు దర్శకుడు.. తాజాగా ప్రిన్స్ అనే సినిమాతో మన ముందుకొచ్చిన అనుదీప్ సైతం ఒక భయంకర వ్యాధితో బాధ పడుతున్నట్టు చెప్పాడు. పిట్టగోడ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ నవ్వులు పూయించిన ఈ దర్శకుడి వ్యాధి గురించి తెలిసిన ఫాన్స్ నమ్మలేకపొతున్నారు. తాజాగా శివ కార్తీకేయన్‌తో తీసిన ప్రిన్స్‌ అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. అందుకే అనుదీప్ ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నారంతా. కానీ ఆరోగ్యం బాగోలేకనే అనుదీప్ ప్రమోషన్స్ కి రావటంలేదని.. రెస్ట్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే ఈ విషయాలని ద్రువుకరిస్తూ తాజాగా దర్శకుడు అనుదీప్ తన వ్యాధి గురించి ఓపెన్ అయిపోయాడు. ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ దర్శకుడు అనుదీప్ తో చేసిన ఇంటర్వ్యూలో తన అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు. తనకు హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ (హెచ్‌ఎస్‌పీ) అనే డిజార్డర్‌ ఉందని.. ఈ వ్యాధి ప్రపంచంలో ఇంకా ఎక్కడ ద్రువీకరించలేదని.. ఇంకా పరిశోధనల్లోనే ఉందని.. దీనికి ఎలాంటి మందులు ఇంకా మెడికల్ గైడ్ లైన్స్ లో కూడా లేవని చెప్పాడు అనుదీప్.

జర్నలిస్టుతో అనుదీప్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో ఈ డిజార్డర్‌ లక్షణాలుంటాయి కానీ అర్ధం చేసుకోలేరని తెలిపాడు. తన శరీరంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో తాను ఈ వ్యాధి గురించి తెలుసుకున్నాను అన్నాడు. తనకు గ్లూటెన్‌ పడదని.. కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర రాదని.. ఏదైనా పళ్ల రసం తాగితే మైండ్‌ కామ్‌ అవుతుందని తెలిపాడు. ఈ డిజార్డర్‌ ఉన్న వారి సెన్సెస్‌ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయని.. ఎక్కువ కాంతి వంతమైన లైట్లు చూసినా, ఘాటైన వాసనలు చూసినా తట్టుకోలేరని.. ఈ వ్యాధి ఉన్నవారు.. చాలా త్వరగా అలసిపోతారని చెప్పుకొచ్చాడు అనుదీప్. ఇక ఈ వ్యాధి శాస్త్రీయంగా ఎక్కడ నిరూపించలేదని.. ఇంకా ఈ వ్యాధికి మందులని కనుక్కునే పరిశోధనల్లోనే ఉందని చెప్పాడు. కానీ తన సొంత రీసెర్చ్ తో ఈ వ్యాధి లక్షణాలని అర్ధం చేసుకుని తానె రూపొందించుకున్న సొంత డైట్ తో వ్యాధిని కంట్రోల్ లో పెట్టుకుంటున్నట్టు తెలిపాడు అనుదీప్. ఏదేమైనా చూడడానికి చాలా సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ.. ఎప్పుడు నవ్వుతు అందరిని నవ్వించే అనుదీప్ ని ఇంత భయంకర వ్యాధి వేధిస్తోందని తెలిసిన వారు ఎమోషనల్ అవుతున్నారు. అయితే మరికొందరు మాత్రం అనుదీప్ చాలా సీరియస్ గా జోక్ చేస్తున్నాడని కొట్టిపారేస్తున్నారు.