Director Dil Raju serious on vamsi paidipalli
mictv telugu

వంశీ పైడిపల్లిపై దిల్ రాజు సీరియస్.. బంధం బెడిసికొట్టింది!

October 28, 2022

Director Dil Raju serious on vamsi paidipalli

ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులనi పరిచయం చేశాడు దిల్ రాజు. అయితే దిల్ రాజు బ్యానర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ డైరెక్టర్ అయిన వారిలో వంశీ పైడిపల్లి ఒకరు. శ్రీవెంకటేశ్వర బ్యానర్‌పై సుకుమార్, బోయపాటి శ్రీను, శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్ వంటి ప్రముఖులు దర్శకులుగా అరంగేట్రం చేయగా.. ‘మున్నా’ సినిమాతో దర్శకుడిగా మారారు వంశీ పైడిపల్లి. ఆ మూవీ ఫ్లాప్ అయినా.. దిల్ రాజు బృందావనం వంటి సినిమా చేసే రెండవ అవకాశం ఇచ్చాడు. దాంతో ఎన్టీఆర్‌తో కెరీర్‌లో తోలి సూపర్ హిట్ కొట్టిన వంశీ అక్కడి నుండి వెనుతిరిగి చూడలేదు. ‘ఎవడు’, ‘ఊపిరి’, ‘మహర్షి’ వంటి విజయవంతమైన చిత్రాలను తీసి ఇండస్ట్రీలో హిట్ కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వంశీకి దిల్ రాజుతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. మరి ఆ చనువుతోనో లేక ఇంకేదైన కారణమో కానీ తాజాగా వంశీ పైడిపల్లిపై దిల్ రాజు తీవ్ర స్థాయిలో సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి ఇటీవల మాట్లాడిన తీరుపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహించారని అంటున్నారు.

అసలు విషయానికి వస్తే.. తమిళ హీరో విజయ్‌తో దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. తెలుగులో ‘వారసుడి’గా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తమిళ మీడియాతో వంశీ మాట్లాడుతూ.. వారసుడు పూర్తిగా తమిళ సినిమా అని బలంగా చెప్పాడు. ఇలా చెప్పటంతో సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకవని.. తమిళ్ డబ్బింగ్ అంటే బయ్యర్లు భయపడతారని.. అలా చెప్పాల్సింది కాదని వంశీ పైడిపల్లిపై దిల్ రాజు సీరియస్ అయ్యాడని అంటున్నారు. వారిద్దరి మధ్య సోదర భావం ఉండడంతో కాస్త గట్టిగా వాదించుకున్న సందర్బాలు ఉన్నాయట. ఇక దిల్ రాజు ఆ చనువుతో గట్టిగానే కౌంటర్ ఇచ్చి ఉండవచ్చనే కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక వారసుడు ట్రైలర్ చూసిన తెలుగు ఫ్యాన్స్.. ఇది అచ్చం మహేష్ బాబు మహర్షి మూవీలా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. మహర్షికి కాసిన్ని మార్పులు చేసి వారసుడిగా తెరకెక్కించారని.. అది బయట చెప్తే తెలుగు కలెక్షన్స్ రావని అందుకే బాహాటంగా చెప్పటం లేదని తెలుగు నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.