director geetha krishna sensational comments on casting couch
mictv telugu

రేణూ దేశాయ్‌ కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలే.. గీతా కృష్ణ

May 25, 2022

director geetha krishna sensational comments on casting couch

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కొన్నేళ్ల క్రితం మొత్తం ప్రపంచ సినిమా పరిశ్రమను కుదిపేసింది. టాలీవుడ్‌లో శ్రీరెడ్డి రచ్చకెక్కే వరకూ ఇలాంటి వ్యవహారాలు బహిరంగంగా ఎవరూ మాట్లాడలేదు. సినిమాల్లో అవకాశాల కోసం వేచి చూసే యువతులను దర్శక నిర్మాతలు, హీరోలు పడక సుఖాన్ని కోరుకుంటారని, అలా కమిట్‌మెంట్ ఇచ్చిన వాళ్లకే అవకాశాలు ఇస్తారని చాలా మంది ఆరోపించారు. దానికి పరిశ్రమలో ఉన్నవాళ్లు కొందరు ఏకీభవించారు కూడా. ఇప్పుడు తాజాగా ఇదే విషయం గురించి దర్శకుడు గీతా కృష్ణ మరోసారి మాట్లాడుకునేలా చేశాడు.

ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ‘మీరు పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా మార్పులు గమనించారా? అని ప్రశ్నించగా సమాధానంగా ‘ఏం మార్పు లేదు. హీరోయిన్లు అప్పుడైనా పడుకోవాల్సిందే.. ఇప్పుడైనా పడుకోవాల్సిందే. ఇది ఇండస్ట్రీలో పాతుకుపోయింది. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కే ఇది తప్పలేదు. సింగర్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇలాంటి విషయాలు బయటపెడితే ఆఫర్లు రావనే భయంతో ఎవ్వరూ చెప్పరు. కాకపోతే క్యాస్టింగ్ కౌచ్ ఒక్కటే కాదు హనీ ట్రాప్ కూడా ఉంది. ఆఫర్ల కోసం హీరోయిన్లు, యువతులు తమకు తామే సమర్పించుకుంటారు. ఎక్కడైనా ఇలాంటివి ఉంటాయి కానీ, సినీ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ. 90 శాతం వరకు ఇలానే ఉంటుంది. అమ్మాయిలకు సినిమా ఇండస్ట్రీ సరైంది కాదు’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే రేణూ దేశాయ్‌నే కమిట్ మెంట్ అడిగే దమ్ము ఎవరికి ఉందా? అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.