Director Gopichand Reaction On Love Rumors With Shruti Haasan
mictv telugu

శ్రుతితో లవ్ ట్రాక్.. నా కొడుకు కంటే ఆమె ఎక్కువ.. భార్యకి కూడా తెలుసు..!

January 19, 2023

Director Gopichand Reaction On Love Rumors With Shruti Haasan

దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రుతిహాసన్‌కి ‘ఐ లవ్ యూ’ చెప్పడం గురించి వివరించారు.
వీరసింహారెడ్డి సినిమా విడుదలకు ముందు ఒంగోలు వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా వేదికపై శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. దర్శకుడు గోపీచంద్ మలినేని తనకు సోదరుడని అన్నారు. అయితే ఆ తర్వాత శ్రుతి హాసన్ గురించి మాట్లాడిన గోపీచంద్ మలినేనికి.. ‘శృతి ఐ లవ్ యూ’ అని చెప్పాడు. దాంతో సోషల్ మీడియాలో గోపీచంద్ మలినేనిని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకున్నారు. శృతి హాసన్ తో రిలేషన్ ఉన్నాడని.. ఎఫైర్ నడుస్తుందని పుకార్లు సృష్టిస్తూ అతని వైఖరిపై చాలా ట్రోల్స్ వచ్చాయి. చివరకు శ్రుతిహాసన్‌కి లవ్ యూ అని ఎందుకు ప్రపోజ్ చేయాల్సి వచ్చిందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేని వివరించాడు.

నిజానికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ నటిస్తున్న మూడో సినిమా ఇది. రవితేజ బలుపు, క్రాక్ చిత్రాల తరువాత శృతితో గోపీచంద్ హ్యాట్రిక్ మూవీ వీరసింహారెడ్డి. అందుకే వీరిద్దరి మధ్య రూమర్స్ వచ్చాయి. దీనిపై ఎట్టకేలకు డైరెక్టర్ గోపీ చంద్ క్లారిటీ ఇచ్చారు.“శృతి హాసన్‌తో నాకు మూడో సినిమా. ఆమె అంటే చాలా ఇష్టం. శృతి నా ఫేవరెట్‌ హీరోయిన్‌. మా కుటుంబంలోని అమ్మాయిలా చూస్తా. నా భార్యతో కూడా ఆమెకు మంచి అనుబంధం ఉంది. మా ఇద్దరిది అన్నా-చెల్లి బంధం. అందుకే ఆమె స్టేజ్‌పై బ్రదర్ అని అన్నది. నా కొడుకు కంటే శృతి హాసన్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఓ అన్నయ్యగా ఐ లవ్​ యూ చెబితే.. సోషల్​మీడియాలో దానికి రివర్స్​ చేసి మసాలా యాడ్​ చేసి చూపించారు.” అని అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని.