ఎన్టీఆర్ కథానాయకుడు.. తర్వాత మహానాయకుడు - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ కథానాయకుడు.. తర్వాత మహానాయకుడు

October 4, 2018

నటుడు, దివంగత సీఎం ఎన్‌టీ రామాారావు జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా .. రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్ ప్రస్థానాన్ని చూపించనున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమని భావించిన డైరెక్టర్ ఓ నిర్ణయం తీసుకున్నారు.

gg

బయోపిక్‌ను రెండు భాగాలుగా తీయాలను క్రిష్ నిర్ణయించారు.. ఆయన సినిమా జీవిత వైభవాన్ని ఒక భాగం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ప్రయాణాన్ని ఒక భాగంగా ప్రేక్షకులకు చూపిద్దామని క్రిష్ బాలకృష్ణకు సూచించాడు. దీనికి బాలయ్య కూడా ఓకే చెప్పాడు.

‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటి భాగానికి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.  ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. రెండవ భాగానికి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా కూడా జనవరి 24న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను  హీరో రానా తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.