director krishna vamsi comments on divorce with his wife ramya krishnan
mictv telugu

అదో శాడిజం.. రమ్యకృష్ణతో విడాకులు..!

January 1, 2023

టాలీవుడ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటల్లో రమ్యకృష్ణ-కృష్ణవంశీల జోడీ ఒకటి. నాగార్జున చంద్రలేఖ సినిమా షూటింగ్ లో ఏర్పడ్డ పరిచయం స్నేహంగా మారి ప్రేమ, పెళ్ళికి దారితీసిందంటారు. అయితే వివాహం తరువాత కూడా కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటే.. రమ్యకృష్ణ చెన్నైలో వేరుగా ఉంటారు. అప్పుడప్పుడు కృష్ణవంశీ చెన్నైకి వెళ్లి వస్తాడని.. పిల్లల చదువులు కూడా అక్కడే అని టాక్. అయితే పెళ్లి తరువాత విడివిడిగా ఉంటుండంతో సహజంగానే వీరిద్దరిపై రూమర్స్ వస్తూ ఉంటాయి. రమ్యకృష్ణ కృష్ణవంశీల వైవాహిక జీవితం సరిగ్గా లేదని.. తీవ్ర స్థాయిలో మనస్పర్థాలు ఉన్నాయని.. అందుకే వేరుగా ఉంటున్నారని ఎప్పటి నుండో పుకార్లు రావటం వాటికి రమ్యకృష్ణ, కృష్ణవంశీలు ఖండిస్తూ ఉంటడం కామన్ గా మారింది. అయితే గత కొంత కాలంగా మాత్రం విడాకుల కథనాలు చెన్నై సర్కిల్స్ లో ఎక్కువయ్యాయి.

ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కృష్ణవంశీ మీడియాకి పెద్ద ఎత్తున ఇంటర్వ్యూస్ ఇస్తున్న క్రమంలో.. పదేపదే విడాకుల టాపిక్ వస్తుండటంతో కుండబద్దలు కొట్టేసాడు. రమ్యకృష్ణతో విడాకుల పుకార్లపై క్రియేటివ్ డైరెక్టర్ తాజాగా స్పందిస్తూ.. అలాంటి రూమర్లు వ్యాప్తి చేయడం శాడిస్టిక్ థింగ్స్, శాడిస్టిక్ పనులు.. అలాంటి వారిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది.. అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోతోన్నారనిపిస్తుంది.. ఆ రూమర్లలో ఎలాంటి నిజం లేదు.. అని కృష్ణవంశీ కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పుకొచ్చాడు.