ప్రధాని మోదీకి లేఖ రాసిన పూరీ జగన్నాథ్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధాని మోదీకి లేఖ రాసిన పూరీ జగన్నాథ్

October 21, 2019

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆదివారం రోజున ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. లేఖలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై కొన్ని సూచనలను చేశారు. ఆ లేఖను పూరి తన ట్వీటర్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పూరి లేఖ రాస్తూ…ప్రస్తుతం పర్యావరణ మార్పులకు కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రమే కారణం కాదని, దీనితో పాటు అనేక ఇతర అంశాలు కూడా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నారు. కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తే పర్యావరణంలో ఒక్కసారిగా మార్పు రాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఒక్క సారిగా ఈ నిషేధం వల్ల ప్రజలందరూ ప్లాస్టిక్‌ను వదిలి పేపర్ బ్యాగులు వాడడం చేస్తారని దీని వల్ల పేపర్‌‌కు విపరీతమైన డిమాండ్ వస్తుందని.. తద్వారా చెట్లను ఎక్కువగా నరికే పరిస్థితి వస్తుందన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరి లేఖపై మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.