Director Puri Jagannath approached the Jubilee Hills police saying that the exhibitors were harassing him
mictv telugu

వాళ్లు చంపేస్తారు.. పూరి జగన్నాథ్ ఆందోళన

October 27, 2022

 

Director Puri Jagannath approached the Jubilee Hills police saying that the exhibitors were harassing him

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎగ్జిబిటర్లు అయిన ఆడెపు శ్రీనివాస్ అలియాస్ వరంగల్ శీను, సినిమా ఫైనాన్షియర్ శోభన్ బాబు అలియాస్ శోభన్ లు ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో తనను వేధిస్తున్నారని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పూరిజగన్నాథ్ తన కంప్లయింట్ ను పర్సనల్ సెక్రటరీ ద్వారా పోలీసులకు పంపించారు.

పూరి జగన్నాథ్ కు చెందిన పూరి కనెక్ట్స్ ఎల్ఎల్ పి ఆధ్వర్యంలో స్వీయ దర్శకత్వంలో లైగర్ సినిమాను నిర్మించారు పూరీ జగన్నాధ్. సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో కాకతీయ ఎగ్జిబిటర్స్ నిర్వాహకుడైన వరంగల్ శ్రీనుతో ఏప్రిల్ 12వ తేదీన ఒప్పందం చేసుకున్నారు. సినిమా నష్టాల పాలు కావటంతో దాదాపు 80 మందితో కలసి ఎగ్జిబిటర్లు అంతా నేడు జూబ్లీహిల్స్‌లోని పూరీజగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని, డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినా పలువురు బెదిరింపులకు పాల్పడ్డారంటూ పూరీ ఓ ఆడియోలో తెలిపారు.

తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో రక్షణ కోరుతూ పోలీసులకు లేఖ రాశారు పూరీ జగన్నాథ్. ఇక ఈ వ్యవహారంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ఎగ్జిబిటర్లు సోషల్ మీడియాలో జరిపిన చర్చ తాలూకు స్క్రీన్ షాట్ లను బెదిరింపు సందేశాలుగా పేర్కొని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తాజా పరిణామాలతో పూరి జగన్నాథ్ ఇంటివద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.