లారెన్స్‌కు అవమానం.. సినిమా నుంచి బయటికి.. - MicTv.in - Telugu News
mictv telugu

లారెన్స్‌కు అవమానం.. సినిమా నుంచి బయటికి..

May 19, 2019

నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌కు హిందీ చిత్రసీమలో అవమానం జరిగింది. లారెన్స్ నటించిన ‘కాంచన’ సినిమాను హిందీలో లక్ష్మి బాంబు పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలుకాగా తాజాగా తాను ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు లారెన్స్ ప్రకటించారు.

గౌరవం లేని చోట ఉండటం సరికదన్న ఆయన కనీసం తనకు చెప్పకుండానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారని, ఇలాంటివి చాలా ఉన్నాయని అందుకే బయటికి వచ్చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు కాబట్టి తాను రాసుకున్న స్క్రిప్టును అక్షయ్ కుమార్ మీదున్న గౌరవంతో వారికే ఇచ్చేస్తానని, దర్శకుడిగా వారికి నచ్చిన వారినే పెట్టుకోవచ్చని అన్నారు. దీనికి సంబందించిన వాట్సాప్ మెస్సేజ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.