దేశానికి రాజైనా తన కూతురికి నాన్నే అనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు దర్శకధీరుడు రాజమౌళి. తనదైన వైవిధ్యమైన, ప్రయోగాత్మకమైన చిత్రాలతో ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసిన రాజమౌళి తన కూతురి కోరిక తీర్చేందుకు ఫ్యాన్ అవతారమెత్తారు. తన స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి మరీ ఓ తండ్రిలా తన బాధ్యతను నిర్వర్తించి మరోసారి అందరి దృష్టి ఆకర్షించారు జక్కన్న. ఇంతకీ తన కూతురు ఏం కోరుకుంది? అందుకోసం రాజమౌళి ఏం చేశారు ? తెలుసుకోవాలని ఉందా? అయితే పదండి.
ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ అధికారికంగా ఈ రోజు ప్రారంభమైంది. గెస్ట్‌గా వచ్చిన రాజమౌళి క్లాప్ కొట్టి మరీ షూటింగ్ స్టార్ట్ చేశారు.
అందరూ ఈ కార్యక్రమంలో బిజీబిజీగా ఉంటే..రాజమౌళి మాత్రం ఓ పేపర్ , పెన్ను పట్టుకుని జాన్వీ కపూర్ దగ్గర కనిపించాడు. ఇది చూసి అందరూ షాకయ్యారు. మొదట అందరూ జాన్వీతో త్వరలో జక్కన్న చేయబోయే మహేష్ సినిమా కోసం సైన్ తీసుకుంటున్నారేమో అని భావించారు. జాన్వీ కూడా ఆ పేపర్‌పై రెండు సార్లు ఏదో రాయడంతో అసలు ఏం జరుగుతోందని అందరూ ఆలోచనలో పడిపోయారు. ఇక అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇంతరీ విషయం ఏమిటంటే రాజమౌళి కూతురు మయూక, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు పెద్ద ఫ్యాన్ అట. ఎలాగో జక్కన్న ఈ లాంఛింగ్ ఈవెంట్‌కు వెళ్తున్నారు కాబట్టి తన కూతురు జాన్వీ ఆటోగ్రాఫ్ కావాలని కోరిందట. కూతురు అడిగితే ఏ తండ్రి కాదంటాడు చెప్పండి. దీంతో రాజమౌళి తన కూతురి కోసం ఓ అభిమానిలా మారిపోయారు. అందుకని రాజమౌళి జాన్వి కపూర్‌తో ఆటోగ్రాఫ్ చేయించుకున్నాడు. మొదట జాన్వీ పేపరు మీద సంతకం మాత్రమే చేసింది, అయితే రాజమౌళి అలా కాదు,తన కూతురిని ఉద్దేశిస్తూ ఏదైనా ఇన్స్పిరేషన్గా రాసిమన్నారు. దీంతో జాన్వీ మరోసారి పేపర్ మీద రాసింది. ఇదంతా ఈవెంట్ ప్రారంభం అవ్వడానికి ముందే ప్లాన్ చేశారు జక్కన్న. అంతే కాదు జాన్వీతో చాలా సేపు ముచ్చటించారు .