Director Rajamouli Praises Hero Nani Dasara Movie Teaser
mictv telugu

దసరాపై రాజమౌళి కామెంట్స్.. కోతి లెక్క గెంతుతున్న దర్శకుడు..!

January 30, 2023

Director Rajamouli Praises Hero Nani Dasara Movie Teaser

తెలంగాణ సింగరేణిలోని వీర్లపల్లి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఊర మాస్ చిత్రం దసరా. న్యాచురల్ స్టార్ నాని తొలిసారి పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. సాఫ్ట్ ఇమేజ్ తో క్యూట్ లుక్స్ లో కనిపించే నాని ఫస్ట్ టైం భయంకర డీ గ్లామర్ రోల్ చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలవ్వగా.. ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ టీజర్‌ను S. S. రాజమౌళి రిలీజ్ చేశాడు.

అనంతరం మూవీ టీమ్‌ను రాజమౌళి మెచ్చుకున్నారు. ‘దసరా టీజర్ విజువల్స్ బాగా నచ్చాయి. నాని భారీ మేక్ఓవర్ ఆకట్టుకుంటుంది. ఒక కొత్త దర్శకుడు అలాంటి ప్రభావాన్ని సృష్టించడం చాలా బాగుంది. చివరి షాట్ అద్భుతం. అంతా మంచి జరగాలి..’ అని ఆయర ట్వీట్ చేశారు. అయితే రాజమౌళి ట్వీట్ కి చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఒదెల రెస్పాండ్ అయ్యాడు. సార్.. మీ ట్వీట్‌కు నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది. మీకు ఇంగ్లిష్‌లో రిప్లై పెడదాం అనుకున్నా.. కానీ తెలుగులోనే మాటలు వస్తలేవు సార్. కోతి లెక్క గెంతుతున్నా.. చాలా ధన్యవాదాలు సార్..’ అంటూ ఉత్సాహంతో ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.