ప్రియాంకరెడ్డి హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంకరెడ్డి హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ

December 1, 2019

యావత్ దేశంలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారంపై ప్రముఖలు ఘాటుగా స్పందించిన సంగతి తెల్సిందే. క్రికెట్ విరాట్ కోహ్లీ మొదలు నటుడు మహేష్ బాబు వరకు అంతా ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండించారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డవాళ్లను పిచ్చికుక్కలతో పోల్చారు. 

‘ప్రియాంకరెడ్డిని దారుణంగా హత్య చేసిన వారి మానసిక స్థితి పిచ్చికుక్కల కన్నా హీనంగా ఉంది. అలాంటి పిచ్చికుక్కలను హింసించి చంపాలని డిమాండ్‌ చేయటం కూడా వృథా. వాళ్లకు ఎంత పెద్ద శిక్ష వేసినా అది తక్కువే అవుతుంది. దానికి బదులు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలి. ఏ రేపిస్ట్‌ కూడా గత అనుభవాల నుంచి ఏం నేర్చుకోరు. 2012లో జరిగిన నిర్భయ ఘటన నుంచి ఇప్పటి వరకు మనం ఇదే నేర్చుకున్నాం. ఎందుకంటే వాళ్లకు గతం నుంచి భయం నేర్చుకునేంత మెంటల్‌ కెపాసిటీ ఉండదు. ఓ పిచ్చి కుక్క గతంలో మరో పిచ్చి కుక్కపై జరిగిన దాడిని చూసి ఏం నేర్చుకుంటుంది’ అని వర్మ ట్వీట్ చేశారు.