అంతర్జాతీయ సినిమాను ప్రకటించిన వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

అంతర్జాతీయ సినిమాను ప్రకటించిన వర్మ

November 25, 2019

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కాబోతున్నది. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లలోని సన్నివేశాలు జనాలకు, రాజకీయ నాయకులకు షాక్ ఇచ్చాయి. దీంతో సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇదిలా ఉంటే వర్మ మరో అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించాడు. గతంలో మియా మాల్కోవా ప్రధానపాత్రలో ‘జీఎస్టీ’ అనే సినిమా తీసిన సంగతి తెల్సిందే. ఇప్పుడు ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ పేరుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా టీజర్‌ను బ్రూస్ లీ జయంతి రోజైన ఈనెల 27 వ తేదీన సాయంత్రం 3:12 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను వచ్చే నెల డిసెంబర్ 13 వ తేదీన బ్రూస్ లీ సొంత నగరమైన చైనాలోని ఫోషన్ సిటిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్‌లో సినిమాను నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.