director Ram Gopal Varma makes key remarks on the Jubilee Hills gang rape incident
mictv telugu

రఘునందన్ ఒక్కరే నిజాయితీగా మాట్లాడుతున్నారు.. ఆర్జీవీ

June 8, 2022

director Ram Gopal Varma makes key remarks on the Jubilee Hills gang rape incident

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై సినీ రంగానికి చెందిన ఆర్జీవీ మాట్లాడుతూ ‘‘జూబ్లీహిల్స్‌ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రమే నిజాయితీగా మాట్లాడుతున్నారు. మిగతా వారంతా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం బాధాకరం’’ అని ట్వీట్‌ చేశారు.

కాగా ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై ఎమ్మెల్యే రఘునందనరావు మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రముఖల పిల్లలు ఉండటంతోనే కేసు దర్యాప్తును పోలీసులు నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేయడంతో రఘునందన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.