వర్మ మరో సంచలనం..ఈసారి ఇద్దరు హీరోయిన్ల ప్రేమకథ - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ మరో సంచలనం..ఈసారి ఇద్దరు హీరోయిన్ల ప్రేమకథ

August 9, 2020

No more Toll In Idukki Landslide Rises To 27.....

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెల్సిందే. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను సడలించినప్పటికీ కరోనా వ్యాప్తి కారణంగా పెద్దగా సినిమా షూటింగ్ లు జరుపుకోవడం లేదు. కానీ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం కరోనా వైరస్ వ్యాప్తిలో దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. థియేటర్లు బంద్ ఉండడంతో ఆర్జీవీ వరల్డ్ అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో తన సినిమాలను విడుదల చేస్తూ పర్ వ్యూ ఇంత అని డబ్బులు వసూల్ చేస్తున్నాడు. 

ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నేకేడ్’, ‘పవర్ స్టార్’ వంటి సినిమాలను అందులో విడుదల చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ‘కరోనా’, ‘మర్డర్’, ‘అల్లు’, ‘అర్ణబ్’ వంటి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇవి పూర్తికాకముందే ‘డేంజరస్’ అనే మరో సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇది ఒక లెస్బియన్ క్రైమ్ యాక్షన్ లవ్ స్టోరీ అని వర్మ తెలిపాడు. ఈ హీరోయిన్లు ఇద్దరు ఉన్న పలు పోస్టర్లను వర్మ రిలీజ్ చేశాడు. వాటిలో ఈ ఇద్దరు హీరోయిన్లు ముద్దు పెట్టుకుంటునట్టు ఉంది. ఈ సినిమాను థియేటర్ లో విడుదల చేస్తాడా.. లేదా ఆర్జీవీ వరల్డ్ లో రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.