వర్మ..'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' టీజర్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ..’ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ టీజర్ వచ్చేసింది

November 27, 2019

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ఆయన రూపొందించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ఈనెల 29న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెల్సిందే. ఇంతలో మరో సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దానిని స్ఫూర్తిగా తీసుకొని ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ టైటిల్‌తో ఓ సినిమాను తీశాడు. 

ఇండో-చైనీస్ సంయక్త నిర్మాణంలో ఈ సినిమా తెరక్కింది. ఈ సినిమా ద్వారా పూజా బాలేకర్ అనే నటి వెండితెరకు పరిచయం అవుతోంది. ఇక డిసెంబర్ 13 వ తేదీన చైనాలో బ్రూస్ లీ పుట్టిన పట్టణంలో సినిమా ట్రైలర్ విడుదల చేస్తారట. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే క్రమంలో ఓ యువతి పడిన కష్టం.. బ్రూస్ లీ లా మారే సమయంలో ఆమెకు ఎదురైనా కష్టాలను వర్మ ఈ టీజర్‌ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. బ్రూస్ లీకి వర్మ పెద్ద ఫ్యాన్ అనే సంగతి తెల్సిందే.