కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..రెండో ట్రైలర్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..రెండో ట్రైలర్ వచ్చేసింది

November 20, 2019

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ, వైకాపా పార్టీల పాలిటిక్స్, విజయవాడ రౌడీలు, హత్యా రాజకీయాలు.. చంద్రబాబు, సీఎం జగన్, లోకేశ్‌, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ, అమిత్ షా..  మరెందరో.. అధికారం కోసం ఒకరు, అధికారాన్ని కాపాడుకోడానికి మరొకరు పన్నే పన్నాగాలు, ప్యాకేజీలు, వెన్నుపోట్లు..మొత్తంగా ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో సినిమా తీసున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే దీనికి సంబందించిన ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లోని ప్రముఖ నేతలందరికి ఆర్జీవీ గురిపెట్టినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈరోజు వర్మ రెండవ ట్రైలర్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ట్రైలర్ 2తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించాడు. నవంబర్ 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల కాబోతుందని ట్రైలర్ చివర్లో ప్రకటించాడు.