చంద్రబాబు, లోకేశ్ ఆ సినిమా చూడండి..వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు, లోకేశ్ ఆ సినిమా చూడండి..వర్మ

March 30, 2020

director ram gopal varma requested nara lokesh and chandrababu to watch Amma Rajyamlo Kadapa Biddalu

కరోనా మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, తన తనయుడు లోకేష్ కూడా ఇంటికే పరిమితమయ్యారు. 

దీంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాళ్లపై ట్విట్టర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌లు ఇద్దరూ లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో వాళ్ళు అమెజాన్ ప్రైమ్‌లో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా చూడాలని కోరుతున్నానని ట్వీట్ చేశారు. ఆ సినిమా చూసి వారిద్దరి విలువైన అభిప్రాయాలను ఫీడ్ బ్యాక్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.