'టీచర్ టీచర్ ఆ అర్ణబ్ తిడుతున్నాడు'.. వర్మ సెటైర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘టీచర్ టీచర్ ఆ అర్ణబ్ తిడుతున్నాడు’.. వర్మ సెటైర్

October 13, 2020

hghmn

బాలీవుడ్‌ సినీ ప్రముఖులపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశారు. వారిని ఏకంగా స్కూల్ పిల్లలతో పోల్చాడు. గత కొన్ని రోజులుగా రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ ఛానళ్లలో బాలీవుడ్‌లో డ్రగ్ కల్చర్ గురించి డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఈ డిబేట్లలో ముఖ్యంగా రిపబ్లిక్‌ టీవీకి చెందిన అర్ణబ్‌ గోస్వామి, ప్రదీప్‌ భండారితో పాటు టైమ్స్‌ నౌకు చెందిన రాహుల్‌ శివ్‌ శంకర్‌, నవికా కుమార్‌లు ఎక్కువగా పాల్గొన్నారు. దీంతో ఈ టీవీ చానళ్ళు బాలీవుడ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాయని హిందీ సినీ ప్రముఖులు గుర్రుగా ఉన్నారు.  

ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ డ్రగ్స్‌ బానిసలతో నిండిపోయిందని కథనాలు ప్రసారం చేశాయని బాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టులో ఈ ఛానళ్లపై పరువునష్టం దావా వేశారు. పరువు నష్టం దావా వేసిన వారిలో ఆదిత్య చోప్రా‌, అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, కరణ్‌ జోహర్, అమీర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌కు చెందిన నిర్మాణ సంస్థలు సహా 38 నిర్మాణ సంస్థలు ఉన్నాయి. దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ..’చాలా ఆలస్యంగా, సమస్య చల్లబడ్డాక బాలీవుడ్ స్పందించింది. ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్ ప్రముఖులు ఫిర్యాదు చేయడం.. బడి పిల్లాడు తమ టీచర్ వద్దకు వెళ్లి టీచర్ టీచర్ ఆ అర్ణబ్ మమ్మల్ని తిడుతున్నాడు టీచర్ అని చెప్పినట్లు ఉంది’ అని ట్వీట్ చేశారు.