దీపిక విషయంలో.. న్యూస్ ఛానల్‌పై వర్మ సెటైర్లు - MicTv.in - Telugu News
mictv telugu

దీపిక విషయంలో.. న్యూస్ ఛానల్‌పై వర్మ సెటైర్లు

September 24, 2020

Director ram gopal varma setires on republic tv0

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో రిపబ్లిక్ న్యూస్ ఛానల్‌పై సెటైర్లు వేశారు. కొన్ని రోజుల క్రితం వర్మ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిపై ఓ సినిమా కూడా ప్రకటించాడు. ఇటీవల బాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం రాజుకుంది. ఈ వివాదంలో ప్రముఖ నటి దీపికా పదుకొనె పేరు కూడా వచ్చింది. రేపు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెకు సమన్లు ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో వర్మ రిపబ్లిక్ టీవీపై సెటైర్లు వేశారు.

‘రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ దగ్గర చాలా డబ్బు ఉంది. దీపికా పదుకొనెను ఫాలో అవ్వడానికి ఓ ఛార్టెడ్ విమానం తీసుకున్న ఆశ్చర్యం లేదు. గాలిలోనే వాళ్ళు లైవ్ రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు విమానం లెఫ్ట్ తీసుకుంది. ఇప్పుడు రైట్ తీసుకుంది. ఇప్పుడే దీపికకు డిన్నర్ ఇస్తున్నట్టు కిటికీ లోంచి కనపడుతోంది.’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిపబ్లిక్ టీవీ అలా చేసినా చేస్తుందని నెటిజన్లు వర్మకి వంత పడుతున్నారు.