నాగవల్లి, విశ్వక్‌సేన్‌ల గొడవలో దూరిన ఆర్జీవీ.. ఓ మగాడికన్నా... - MicTv.in - Telugu News
mictv telugu

నాగవల్లి, విశ్వక్‌సేన్‌ల గొడవలో దూరిన ఆర్జీవీ.. ఓ మగాడికన్నా…

May 2, 2022

యంగ్ హీర్ విశ్వ‌క్ సేన్, టీవీ 9 యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి కి సంబంధించిన న్యూస్ వీడియో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోపై ప‌లువురు త‌మ భిన్నాభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న్స్ అంటూ న‌డిరోడ్డు మీద ప్రాంక్ వీడియో చేసి, న్యూసెన్స్ చేసిన విశ్వ‌క్ సేన్‌పై విమ‌ర్శ‌లు ఎక్కువ‌వుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంక్ వీడియోపై డిబెట్ నిర్వహించిన టీవీ 9 యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లిపై కోప్ప‌డ్డాడు. దీంతో ఒళ్లు మండిన స‌ద‌రు యాంక‌ర్.. విశ్వక్​ సేన్​ను స్టూడియో నుంచి ‘గెట్​ అవుట్’​ అంటూ గట్టిగా అరించింది. ఆమెపై అనుచిత ప‌దాల‌ను కూడా వాడాడు విశ్వ‌క్. ఇందుకుక సంబంధించిన‌ ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. ఈ వీడియోపై తాజాగా సంచలన డైరెక్టర్​ రామ్​ గోపాల్​ ట్విటర్ వేదికగా స్పందించారు.

ఓ మ‌గాడి కన్నా ఒక‌ మ‌హిళ పవర్​ఫుల్​గా కనిపించడం నేను ఇంతవరకు చూడ‌లేదు. ఆమె సర్కార్​ కన్నా తక్కువేం కాదు​’ అంటూ ఆ యాంకర్​ను ట్యాగ్​ చేశాడు ఆర్జీవీ. కాగా ప్రాంక్ వీడియో కారణంగా ఇప్పటికే హీరో విశ్వక్​ సేన్​పై అరుణ్ కుమార్ అనే లాయర్ హ్యుమన్​ రైట్స్​ కౌన్సిల్​లో (హెచ్​ఆర్సీ) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.