Home > Featured > నందమూరి తారకరామారావు ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు జూ.ఎన్టీఆర్‌ : ఆర్జీవీ

నందమూరి తారకరామారావు ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు జూ.ఎన్టీఆర్‌ : ఆర్జీవీ

Director Ramgopal Varma sensational comments On Jr NTR And Sr NTR

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నందమూరి తారక రామారావును చంపినవాళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తున్నారని విమర్శించారు. విజయవాడలో ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌, దేవినేని నెహ్రూ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన చంద్రబాబును టార్గెట్ చేశారు.

" రాజమండ్రిలో ప్రస్తుతం ఒక జోక్ జరుగుతోంది. అతి చెప్పడానికే వచ్చాను. అది ఎవరూ నవ్వలేని జోక్. ఆ జోక్‌కు స్వర్గంలో ఉన్న దివంగత ఎన్టీరామారావుకు నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదు. ఇక్కడ ఇంటి అల్లుడు(చంద్రబాబు) అయిన వ్యక్తి ఎన్టీఆర్‌ను దారుణంగా టార్చర్‌ చేసి ఏడిపించి ఏడిపించి చంపారు. మళ్లీ వారే..ఎన్టీఆర్‎కు దండ వేసి పొగడటం పెద్ద జోక్. చంద్రబాబు ఎలాంటోడో ఎన్టీఆర్.. స్వయంగా ఓ వీడియోలో చెప్పారు.

ఎన్టీఆర్ చనిపోయే సమయంలో ఆయనకు సేవలు చేసిన లక్ష్మీపార్వతిని తప్పుగా చూపెట్టారు. .. లక్ష్మీపార్వతి మాయలో ఎన్టీఆర్‌ పడ్డారంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తి.. లక్ష్మీపార్వతి మాయలో పడిపోతారా ? అంటే ఆయనకు అవగాహన లేదా? అలాంటప్పుడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారు? ఎన్టీఆర్ చావుకు కారణమైన అసలు నిందితులెవరో అందరికి తెలుసు. రజనీకాంత్‌ లాంటి సూపర్ స్టార్ కూడా చంద్రబాబు పక్కన కూర్చుని వాళ్లను పొగడటం అంటే ఆయన కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే.

శత జయంతి వేడుకలకు జూ.ఎన్టీఆర్ ఎందుకు రాలేదో నాకు సరైన కారణం తెలీదు కానీ..తారక్‌ ఒక్కడే తాతమీదున్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదని భావిస్తున్నాను. అందుకు తారక్‌కు నేను థ్యాంక్స్‌ చెప్తున్నా. నందమూరి తారకరామారావుగారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్‌ ఎన్టీఆర్‌.ఆయనకు ఎన్టీఆర్ మీద ఉన్న విపరీతమైన అభిమానంతోనే ఆ సభకు రాలేదు" ఆని ఆర్జీవీ తెలిపారు.

Updated : 28 May 2023 5:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top