director RGv rampgopal varma tweet on pawan kalyan campaign vehicle Vaarahi
mictv telugu

‘పంది బస్సు’… పవన్ బండిపై ఆర్జీవీ

January 25, 2023

director RGv rampgopal varma tweet on pawan kalyan campaign vehicle Vaarahi

రామ్ గోపాల్ వర్మకు ప్రస్తుతం ఒకటే పని. సెలబ్రిటీలను ఓ ఆట ఆడుకోవడం. ముఖ్యంగా తనకు గిట్టని నటులను, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలోనూ, టీవీ ఇంటర్వ్యూల్లో సీన్ ఎప్పుడూ తనవైపు ఉండేలా కామెంట్లు చేస్తుంటాడు. ‘ఆర్జీవీ స్టైల్ అంతేకదా,’ అని జనం పట్టించుకోకపోతే రూట్ మార్చి మరింత వివాదాస్పద కామెంట్లతో వచ్చేస్తుంటాడు. తన సినిమాలు ప్లాప్ కావడం, కొత్త సినిమాలు లేకపోవడం, శిష్యుల సినిమాలు కూడా బోల్తా పడుతుండడంతో మరో పనిలేక ఇలా అందరిపైనా పడుతున్నాడని గిట్టని వాళ్లంటారు. నిజమేదైనా ఆర్జీవీ పంచ్ విసిరితే అదో వార్త. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ ప్రచారం రథం ‘వారాహి’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నోటితో పొడుగుతూనే నొసటితో వెక్కించిన చందగా ఉన్న ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

ఇదీ ట్వీట్..
“గుడిలో ఉంటే అది “వారాహి” రోడ్డు మీద ఉంటే అది “పంది”.. పీ,తన పందికి “వారాహి” అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే” అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి .వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర “వారాహి”ని ఒక “పంది బస్సు”గా ముద్ర వేస్తారు. JAI Pk JAI JANA SENA’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ వారాహి వాహనానికి మంగళవారం తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో, ఈ రోజు బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పూజ చేయించిన నేపథ్యంలో వర్మ వేసిన ట్వీట్‌పై రచ్చ జరుగుతోంది. తమ నాయకుడి బండిని పంది బస్సు అనడంతో పవన్ కల్యాణ్ అభిమానులు వర్మను బండబూతుల తిడుతున్నారు.