‘కొండా’ ఫ్యామిలీపై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘కొండా’ ఫ్యామిలీపై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్

June 13, 2022

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. యూత్‌లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్. ముఖ్యంగా ఆయన చెప్పే లైఫ్ స్కిల్స్‌కు కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఇష్టపడేవాళ్లకు హీరోలా కనిపించే వర్మ.. గిట్టని వాళ్లకు మాత్రం విలన్. దేవుడంటే నమ్మకం లేదని చెప్తూనే… అందుకు పూర్తి భిన్నమైన పనులు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇది ఆయనకు కొత్త కాదు. కొన్నిసార్లు ఆయన చెప్పింది మేధావులకు తప్ప మరెవరీ అర్థం కాదు.

తాజాగా ఆయన కొండా ముర‌ళి జీవిత క‌థ ఆధారంగా తీసిన కొండా చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ త‌న కుటుంబంతో పాటు చిత్ర బృందాన్ని వెంట‌బెట్టుకుని సోమ‌వారం బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. కొండా ఫ్యామిలీ అభ్య‌ర్థ‌న మేర‌కు రాంగోపాల్ వ‌ర్మ కూడా క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు.

ఈ క్ర‌మంలో సోమ‌వారం ఉద‌యం ఆల‌యంలో కొండా సురేఖ పక్క‌నే కూర్చుని రాంగోపాల్ వ‌ర్మ దుర్గ‌మ్మ సేవ‌లో పాల్గొన్నారు. ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన వ‌ర్మ‌… ‘కొండా ఫ్యామిలీ మూలాన ఇదీ నా ప‌రిస్థితి’ అంటూ ఓ కామెంట్‌ను కూడా జ‌త చేశారు. ఈ ట్వీట్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో పాటు కొండా ఫిల్మ్ టీం వికాస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో లైవ్ ఇంటారక్షన్ ఉంటుందని.. దానికి ఎవరూ రావొద్దనే కామెంట్ కూడా జత చేశాడు ఆర్జీవీ.