Director RGV tweet on Niharika Naveen Harihar Krishna triangle love story says love is too blind
mictv telugu

నీహారికను బాడీ షేమింగ్ చేసిన RGV

March 13, 2023

Director RGV tweet on Niharika Naveen Harihar Krishna triangle love story says love is too blind

సంచలనం సృష్టించిన ట్రయాంగిల్ లవ్ క్రైమ్ స్టోరీలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. నవీన్, హరిహరకృష్ణ, నీహారికల మధ్య సాగిన ముక్కోణపు ప్రేమకథ నవీన్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఈ దారుణానికి మూల కారణంగా భావిస్తున్న నీహారిక విచారణలో కొత్త కొత్త అంశాలు చెబుతోంది. నవీన్‌తో బ్రేకప్ అయ్యాకే హరిహర కృష్ణను ప్రేమించానని అంటోంది. అయితే ఆమె చాలా విషయాలు దాచిపెడుతోందని పోలీసులు భావిస్తున్నాయి. మరోపక్క.. నీహారికపై సోషల్ మీడియాలో విమర్శలు, మీమ్స్ వెల్లువెత్తున్నాయి. ఆమె ఫోటో తొలిసారి బయటికి కనిపించినప్పట్నుంచీ చాలామంది బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్నారు. ‘‘ఈ అందగత్తె కోసమా బ్రో, కొట్టుకున్నారు, ఇంకెవరూ దొరకలేదా?’’ అని పోరలు తిడుతున్నారు.

ఇలాంటి క్రైమ్ స్టోరీలంటే చెవులు, ముక్కుతోపాటు అన్నీ కోసేసుకునీ డైరెక్టర్ ఆర్జీవీ కూడా ఈ గొడవపై స్పందించాడు. ప్రేమ గుడ్డిది అంటూ నవీన్, హరిహర, నీహారికల ఫోటోలను షేర్ చేశారు. నీహారిక మరీ సన్నగా ఉన్న ఫోటోను జత చేసి బాడీ షేమింగ్ చేశాడు. ‘‘అమ్మాయి కోసం ఒక అబ్బాయి.. తన స్నేహితుడిని అతి కిరాతకంగా చంపాడు. ప్రేమ గుడ్డిదని తెలుసుగానీ మరీ ఇంత గుడ్డిదని మాత్రం నాకు తెలియదు’ అని ట్వీట్ చేశాడు. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ప్రేమకు అందచందాలతో సంబంధం లేదని, ఆర్జీవీకి ఎర్ర బుర్రగా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టమని కొందరు అంటున్నారు. ‘‘బక్కగా కాకుండా, ఐశ్వర్యా రాయ్‌లా అందంగా ఉంట చంపొయ్యొచా?’’ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.