సినిమా షూటింగ్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోనే ఈ ప్రమాదం జరిగింది. ఓ వెబ్ సిరీస్ కోసం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా రోహిత్ శెట్టి గాయాలపాలయ్యాడు. వెంటనే అతనిని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు బలమైన దెబ్బలు తగిలినట్టు ప్రచారం జరుగుతోంది.
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటి వరకూ అఫీషియల్‌గా ఎటువంటి సమాచారం అందలేదు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వివేక్ ఓబెరాయ్ ఈ సిరీస్‌లో కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ షెడ్యూల్లో కారు ఛేజింగ్‌లు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాటిలో భాగంగా రోహిత్ గాయపడ్డాడని సమాచారం.