ఆల్ ది బెస్ట్ సంపత్ నంది ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆల్ ది బెస్ట్ సంపత్ నంది !

July 28, 2017

రచయితగా తొలి అడుగు వేసిన సంపత్ నంది మంచి దర్శకుడిగా టాలీవుడ్ లో తన పేరును సుస్థిరం చేస్కున్నాడు. ప్రస్తుతం తను డైరెక్టు చేసిన సినిమా ‘ గౌతమ్ నంద ’ ఇవాళ రిలీజ్ అవనుంది. ఒక డిఫరెంటు పాయింటుతో సాగే ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే ఆశాభావంలో వున్నాడు. ఏమైంది ఈ వేళ, రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో తను మంచి టేస్టున్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు.

అలాగే నిర్మాతగాను తన మార్కును వేసాడు సంపత్ నంది. గాలిపటం చిత్రాన్ని నిర్మించి విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. మున్ముందు కూడా దర్శకుడిగా కొనసాగుతూనే ప్రొడ్యూసర్ గా కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తానంటున్నాడు. అలాగే తనలోని రైటర్ను కూడా ఇంకా పదును పెడుతూ అద్భుతమైన స్క్రిప్టులు రాసేస్తుంటానంటున్నాడు. గౌతమ్ నంద సినిమాలో గోపీచంద్ హీరోగా నటించాడు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా తప్పకుండా గుడ్ ఓపెనింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడాలని కోరుకుంటూ సంపత్ నందికి కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్ చెబుదామా !