సీత అమాయకంగా ఉండాలి, అందుకే అలియాను..రాజమౌళి - MicTv.in - Telugu News
mictv telugu

సీత అమాయకంగా ఉండాలి, అందుకే అలియాను..రాజమౌళి

May 6, 2020

director SS Rajamouli reveals the reason behind casting Alia Bhatt in ‘RRR’

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూ.ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలో సీత అనే పాత్రలో బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది.

ఇటీవల దర్శకుడు రాజమౌళి.. సీత పాత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ సినిమా ట్రైయాంగిల్ ప్రేమకథ కానప్పటికీ ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు నటులతో కలిసి ట్రావెల్ చేస్తూ, ఎంతో అమాయకంగా, లాఘవంతో ఎవరికీ ఎటువంటి హానిచేయని మనస్తత్వం గల అమ్మాయిగా సీత పాత్ర ఉంటుందని తెలిపారు. ఈ పాత్రకు అలియా భట్ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమాను డీవీవీ దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.