ఫాంహౌజ్ లో రాజమౌళి..'ఆర్ఆర్ఆర్' స్క్రిప్ట్ పై కసరత్తు! - MicTv.in - Telugu News
mictv telugu

ఫాంహౌజ్ లో రాజమౌళి..’ఆర్ఆర్ఆర్’ స్క్రిప్ట్ పై కసరత్తు!

July 15, 2020

Director ss rajamouli shifted to his farm house to work on rrr script

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డ సంగతి తెల్సిందే. దీంతో నటీనటులు, దర్శకనిర్మాతలు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కారణంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కూడా వాయిదా పడింది. 

రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇప్పట్లో ఈ సినిమా మొదలయే అవకాశాలు కన్పించడం లేదు. దీంతో రాజమౌళి నల్లగొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలోని ఎదులూరు గ్రామంలో ఉన్న తన ఫాంహౌజ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన ‘ఆర్ఆర్ఆర్’ స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారని సమాచారం. తనతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని కూడా వెంట తీసుకెళ్లినట్టు తెలుస్తోంది‌.