Director Tarun Bhaskar interviewed Sharwanand
mictv telugu

ఆరేళ్లు ఒక్క షర్టు కొనకుండా అప్పులు తీర్చాను : శర్వానంద్

September 7, 2022

టాలీవుడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ఈ నెల 9న విడుదల అవుతోంది. దీంతో చిత్ర ప్రమోషన్లు ప్రారంభించగా, శర్వానంద్‌ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను శర్వానంద్ ఇలా చెప్పుకొచ్చారు. ‘నేను హీరోగా కో అంటే కోటి అనే సినిమా చేశా. దాని నిర్మాత కూడా నేనే. అయితే సినిమా ఫ్లాప్ అయింది. ఆర్ధికంగా చాలా నష్టపోయా. ఆ సమయంలో నా స్నేహితులు, దగ్గరి వారు నన్ను దూరం పెట్టారు. డబ్బు లేకపోతే అంత దుర్భరంగా మనుషులు ఉంటారని నాకప్పుడే తెలిసింది. నష్టం, కష్టం వచ్చిందని మనిషిని వదిలేస్తారా? అని అనిపించేది. డబ్బు ప్రాముఖ్యత నాకప్పుడు అర్ధమైంది. ఎలాగైనా అప్పులు తీర్చాలని డిసైడ్ అయ్యా కానీ, దానికి ఆరేళ్లు పట్టింది. ఈ ఆరేళ్లలో ఒక్క కొత్త షర్టు కూడా కొనలేదు. వచ్చిన ప్రతీ రూపాయిని అప్పు చెల్లించడానికి వినియోగించా’నని వెల్లడించారు. ఇక సాయిపల్లవితో చేసిన పడి పడి లేచే మనసు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నానని, కానీ, ఫలితం వేరేలా వచ్చిందని తెలిపారు. అప్పటినుంచి కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని, తాజా సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.