దర్శకుడు తేజ‌కు కరోనా.. వెబ్ సిరీస్ ఎఫెక్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

దర్శకుడు తేజ‌కు కరోనా.. వెబ్ సిరీస్ ఎఫెక్ట్ 

August 3, 2020

Director Teja Test Corona Positive.

అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెబ్రెటీల వరకు అందరికీ వైరస్ సోకుతోంది. ప్రజా ప్రతినిధులతో పాటు సినీ ఇండస్ట్రీని కరోనా వైరస్ కలవరపెడుతోంది. వరుసగా సినీ ప్రముఖులు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, సీరియల్ నటులు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరోసారి పంజా విసిరింది. తాజాగా ప్రముఖ దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.  

ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో అతనికి పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్యుల సూచనల ప్రకారం చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ కోసం ఆయన డైరెక్షన్ చేశారు. ఈ క్రమంలో వైరస్ సోకినట్టుగా భావిస్తున్నారు. అయితే యూనిట్‌లో ఉన్న వారందరికి నెగిటివ్ రాగా.. తేజ ఒక్కడే వ్యాధికి గురయ్యాడు. కాగా టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు రాజమౌళికి కూడా పాజిటివ్ అని తేలింది. మరోవైపు సీరియల్ నటీనటులు కూడా వ్యాధిబారిన పడుతున్న సంగతి తెలిసిందే.