వర్మ ముసలోడైపోయుండోచ్..! - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ ముసలోడైపోయుండోచ్..!

June 6, 2017


పనిలేనోడు పిల్లి తల కొరుగుతాడంటారు.. వర్మకి పని చాలానే వుంటుంది దానికి తోడు ఖాళీ టైం కూడా చాలానే వుండేటట్టుంది. ఎప్పుడు చూసినా ట్విట్టర్ ని గుత్తకు పట్టుకున్నట్టు అందులో చీటికీ మాటికీ కూస్తుంటాడు. క్రియేటివిటీలో కాంట్రవర్సీని మిక్స్ చెయ్యాలని ఎప్పుడూ తహతహలాడే వర్మకి తన కాలం చెల్లిందని ప్రత్యేకంగా చాటింపేసి చెప్పాలేమో.. తనేం మాట్లాడినా చెల్లుతుంది, సాగుతుందనుకుంటున్న వర్మా నీ ఖర్మే నిన్ను కాల్చి బూడిద చేస్తుందని తెలుసుకునే రోజు త్వరలో వస్తుందని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు. తన స్థానాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరు బట్ మించగలరనేది మాత్రం నిజం. తను సినిమాలు తీయటం పక్కన పెట్టి పామంటే పడిగె అన్నట్టు కూస్తూనే వుంటాడు.

కానీ జనాలు చాలా అప్ డేట్ అయ్యారు. తను చెప్పింది విని తలాడించడానికి జనాలెవరూ సిద్ధంగా లేరు. సప్పుడుగాకుండా ఆయన పని ఆయన చేస్కోకుండా ఈ లొల్లి ఎందుకని ఎంత మంది మొత్తుకున్నా వినడే.. మొండి ఘటం.. తననిలా ఎవరు తయారు చేసుంటారు ? ఎవరంటే.. మనమేదన్న మాటన్నామనుకోండి.. వారెవ్వా సూపర్.. అని చప్పట్లు కొట్టి జబ్బలు చరిచే భజన బ్యాచ్ ఒకటి ప్రత్యేకంగా వుందనేది మాత్రం ట్రూ. ఎందుకో మరి తనని ఇలా తయారు చేసింది పచ్చ మీడియా అని చెప్పకనే తెలిసిపోతోంది జనాలకు. జనాలేం ఎర్రిపప్పలేం కాదు. వర్మ ఏది చెప్పినా నమ్మడానికి. ఇంతకీ ఈ బగారె బాతాఖానీలు నిజంగా ఆయనే మాట్లాడుతున్నాడా ? లేకా ? ?  యెస్.. ఏదో సందర్భంలో వర్మ ఖర్మగాలి ఒక శక్తి తనలోకి పూనుంటుంది. అదే తనతో తిక్క తిక్కగా మాట్లాడిస్తుంటుందేమో.

తనలో బూనిన ఆ దుష్ఠ శక్తిని హతమార్చే శక్తులు జనాలేననిపిస్తోంది. వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవడానికి పచ్చ మీడియా పని గట్టుకొని మరీ మారేడు కాయకి మసి పూస్తుంది. ఆ మారేడు కాయే వర్మ.. బహుషా వర్మను ఇంకా ఆ మీడియా భుజాల మీద మోస్తూనే వుంది. తనకు తాను తోపు అని ఆయన గారు ఒంటరిగా బాత్రూం అద్దంలో చూస్కొని ఎల్లాడేటట్టు చేసింది మీడియా. ‘ ఎహె.. మనోడు తోపు.. బాలీవుడ్ లనే పాగా ఏశిన మొనగాడు, పీకి మల్లేశెటోడని ’ పచ్చ మీడియా బిత్తిరి రాతలు రాశి అది చదివే జనాలను కూడా బిత్తిరోళ్ళను చేసింది ?

ఖర్మరా నాయనా.. ఆయనా ఆయన పైత్యం. తీసిన సినిమాల్లో ఒకటి రెండు మినహాయిస్తే మిగతావన్నీ షరామామూలు సినిమాలే.. మీడియా అంతటిని తనవైపు తిప్పుకొని మనోడింక ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా తాయిలాలు అప్పగించి తనను తీస్మార్ ఖాన్ లా చిత్రించుకుంటాడు. ‘ రాం గోపాల్ వర్మ తోపుర భై.. అస్సలు జెన్కడు, అన్కడు ఎవ్వర్నైనా ఈర్ మార్ అనేస్తడని ’ ఒక రకమైన క్రేజును సంపాధించుకున్నడు. అలా ఆ మహానుభావుణ్ణి ఫాలో అవుతూ ప్రతివాడు తలతిక్క సమాధానాలివ్వటం మొదలు పెట్టాడు. ఇండస్ట్రీలో సామాన్య అసిస్టెంట్ డైరెక్టర్లు సైతం మాకు వర్మే ఆదర్శం, ఆయన మేకింగ్ స్టైలు, విజువలైజేషన్ డిఫరెంటు, వర్మనే అందరికి హట్కే సినిమాలు తీస్తాడని పుకార్ పుకార్ అయిపోయింది… అంతవరకు బాగానే వున్నా అతని తిక్కని కూడా చాలా మంది ఫాలో అవడం చూస్తుంటే నవ్వొస్తుంటుంది. ముందు అతనిలా ఒక్క సినిమా కూడా తియ్యకుండా హౌల మాటలేందిరా నాయనా ? చేతనైతే అతని టేకింగ్ స్టైల్ ని మాత్రమే ఫాలో అవగలిగితే వాళ్ళు తప్పకుండా బికమే గుడ్ డైరెక్టర్ అవగలరు.

సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతీ మొగోడు వర్మ వర్మ అని శిగాలు వూగుతుంటరు.. ఈ భజన మీడియా అతనికి క్రేజుతో పాటు ఒక రక్షణ వలయాన్ని ఏర్పరించింది. అతనికెవరూ తిరిగి సమాధానం ఇవ్వకుండా క్రియేట్ చేసేసింది. వర్మకి కూడా ఫుల్లు కాన్ఫిడెన్సు నేను ఏం కారుకూతలు కూసినా నన్నెవరూ పీకలేరని ఆయనకి ఫుల్ ధీమా.. బట్ వేరే దిక్కు నుండి తన దుష్ప్రభావం వల్ల కొంత మంది చెడిపోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. వర్మ ఆటలన్నీ తెలంగాణ రాక మునుపే సాగినవని చెప్పుకోవచ్చు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది ఇలాంటివారి నాలకలకి తాళాలు పడ్డాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళే చతికిల పడ్డారు. వాళ్ళకు వాళ్ళు పెద్ద పచ్చీస్ మార్కాళ్ళలా ఫీలైనవాళ్ళ తిక్క కుదిర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ముందుంటారు. పవన్ కళ్యాణ్నే పట్టుకొని ‘ ఎవరయ్యా గాయిన ? నేను ఆయిన శీన్మ ఒక్కటి గూడ సూడలే, నేనస్సలు గుర్తువట్ట.. అడ్డమైనోల్ల మాటలు వట్టుకుంట కూసుంటె కలుస్తాది.. ’ అని మూతి మీద గుద్దినట్టు మాట్లాడగానే పవన్ గారి నోరు మూతబడింది. చిరంజీవి సహా చాలా మంది వాళ్ళ వాళ్ళ నోళ్ళను లాకర్లలో పెట్టేసారు. వర్మ తిక్క కుదరాలంటే కేసీఆరే పూనుకొని ఒక పంచ్ ఇస్తే ముడుచుకొని మూలక్కూర్చుంటాడు. కేసీఆరా మజాకా.. అబద్దాల పిల్లర్ల మీద లేచిన బిల్డింగ్ లను అడుగునుండి పెకిలించి పారేయగల సత్తా గల నాయకుడు ఆయన. ఆయన రంగంలోకి దిగితే గానీ వర్మ గారి ఖర్మ పండేట్టులేదనిపిస్తోంది.

ఉదయం లేవగానే మొట్ట మొదట చేసే పని బిఎఫ్ చూడటమని అంటాడా వర్మ.. చెడుని చెవిలో చెప్పాలి మంచిని చందిలో చెప్పాలని ప్రత్యేకంగా తనకి చెప్పాలేమో… ఆన్ లొకేషన్లో టేకింగ్ పని కోడైరెక్టర్లకి అప్పజెప్పి తను డంబుల్స్ తో బైసెప్స్, ట్రైసెప్స్ చేస్తూ కూర్చుంటాడంట. ఆయన కన్నా గొప్ప డైరెక్టర్లు లేరనే ఒక గుడ్డి ధీమాలో వుండిపోయాడనిపిస్తుంది. సెలెబ్రెటీలైన వీళ్ళు పర్సనల్ లైఫ్ లో సైకోల్లా కనిపిస్తారు. అది దాచిపెట్టి పైకి పేద్ద సమాజనోద్ధారకుల్లా మైకుల్లో, ట్విట్టర్లలో కుయ్యటం చూస్తుంటే నవ్వొస్తుంటుంది. ‘ అది మా పర్సనల్.. అది అరవరమని ’ వాదిస్తుంటారు. నువ్వొక పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు నీ పర్సనల్ లైఫ్ గురించి తప్పకుండా అందరికి తెల్సుకోవాలనే తపన వుంటుంది. ఎందుకంటే రేపు నిన్ను వాళ్ళు ఆదర్శంగా తీస్కొని ఎదగాలనకుంటున్నారు గాబట్టి.. సెలెబ్రెటీలై వుండి పర్సనల్ లైఫులో వున్నవాళ్ళని సంక నాకించి ఇలా బహిరంగంగా నీతులు చెప్పటం లేదా కాంట్రవర్సీగా మాట్లాడటం కరెక్ట్ కాదేమో..

గమ్మున ఎవరి పని వాళ్ళు చేస్కుంటే ఏ లొల్లీ వుండదు. వర్మకి బహుశా బీపి వుండొచ్చు. ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్ మెంటై ఏది పడితే అది యూస్ లెస్ గా అస్సలు మాట్లాడకూడదు కదా.. వర్మ అలా తనని తాను మేధావినని ప్రపంచానికి చాటి చెప్పే పనిలో నిమగ్నమై వున్నాడు. ‘ గన్స్ అండ్ థైస్ ’ అనే సీరిస్  ను తన కూతిరితో కలిసి చూస్తావా ? అని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు తనిష్టం అని సమాధానమిచ్చాడు. పాపం తన కూతురు మైండ్ వాయిస్ మాత్రం చాలా హార్ష్ గా వుండొచ్చు.. ‘ ఛీ ఛీ.. ఇలాంటి దరిద్రుడి కడుపులో నేనెందుకు పుట్టానని ’ ..

వర్మా.. వయసు మీద పడుతోందోచ్. పర్సనల్ గా చాలా మిస్సయిపోయావన్న సంగతి త్వరలోనే గుర్తిస్తాడనిపిస్తోందోచ్. ఎంత కాంట్రవర్సీగా మాట్లాడినా దానిక్కూడా ఎక్స్ పైరీ వుంటుంది. అది వర్మ దరి చేరిందనే చెప్పుకోవాలోచ్…