Director Vivek Agnihotri tweeted on Siddhant Veer Suryavanshi's death
mictv telugu

ఆ పిచ్చి వల్లే నటులు చనిపోతున్నారు – వివేక్ సంచలన ట్వీట్

November 11, 2022

Director Vivek Agnihotri tweeted on Siddhant Veer Suryavanshi's death

ఇటీవల కాలంలో సినీ నటులు అకస్మాత్తుగా వచ్చే గుండె పోటుతో చనిపోతున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాస్తవలు జిమ్‌లో కసరత్తులు చేస్తూ మరణించారు. తాజాగా బాలీవుడ్ సీరియల్ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్య వంశీ కూడా ఇలాగే చనిపోవడంతో కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విచారం వ్యక్తం చేస్తూ అందుకు గల కారణాన్ని విశ్లేషించారు.

ఎలాంటి వైద్య సూచనలు పాటించకుండా హైపర్ – జిమ్మింగ్ చేయడమే మరణాలకు కారణమవుతుందని తేల్చి చెప్పారు. అలాగే ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి కూడా మరో కారణమని, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నటులు బాడీని పెంచుకోవాలనే పిచ్చి హడావిడి నుంచి బయటకు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. చివర్లో చనిపోయిన నటుడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్విట్టర్‌లో నివాళులర్పించారు.