Director VV Vinayak About Ntr Kodali Nani Relation
mictv telugu

ఎన్టీఆర్ నానిల మధ్య తీవ్ర మనస్పర్థాలకు కారణం అదే.. వినాయక్ షాకింగ్ కామెంట్స్

November 9, 2022

రాజకీయ నాయకులకి చిత్ర పరిశ్రమతో మంచి సంబంధాలే ఉంటాయి. ఇక సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు వంటి మాజీ ముఖ్యమంత్రుల కుటుంబం కావటంతో నందమూరి హీరోలతో పొలిటీషియన్స్ రెగ్యులర్ టచ్ లో ఉంటారు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో ఎమ్యెల్యే అయ్యానని.. ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఫైర్ బ్రాండ్ ఎమ్యెల్యే కొడాలి నాని ఎన్నోసార్లు చెప్పారు. ఎన్టీఆర్ సిఫార్సు మేరకే తనకి గుడివాడ టికెట్ దక్కిందని.. ఎన్టీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటానని తాజాగా ఇంటర్వ్యూలోను చెప్పారు కొడాలి నాని. అయితే ఎమ్యెల్యే గా పోటీకి ముందు ఎన్టీఆర్ నానిలు మంచి స్నేహితులు. ఎన్టీఆర్ కెరీర్ ని మలుపుతిప్పిన ఆది మూవీ నిర్మాణంలో కొడాలిది కీలక పాత్ర అంటారు. ఆ సినిమాకు వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. అప్ప‌టి నుంచి తార‌క్‌తో కొడాలి నానికి మంచి అనుబంధం ఏర్ప‌డింది. అయితే నాని, ఎన్టీఆర్ ల మధ్య ఇప్పుడు అంతగా స్నేహం లేదని.. అసలు ఇద్దరు మాట్లాడుకోవట్లేదని.. ఇద్దరి మధ్య రాజకీయంగా మనస్పర్థాలు వచ్చాయని వార్తలున్నాయి.

ఈ రూమర్స్ పై వీరిద్దరి కామన్ ఫ్రెండ్ అయిన దర్శకుడు వివి వినాయక్ తాజాగా స్పందించాడు. ఎన్టీఆర్ చాలా సౌమ్యంగా అనిపించే స్నేహితుడు. ఒకసారి ఫ్రెండ్ షిప్ మొదలు పెడితే చివరి వరకు వదిలి పెట్టాడు. కానీ కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య రాజకీయ కోణం వచ్చింది. అందువల్లే వారి మధ్య గ్యాప్ ఏర్పడింది. కొడాలి నానితో ఎన్టీఆర్ తెగదెంపులు చేసుకున్నాడు అని అంటున్నారు. నేను, కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీగారు ఇప్ప‌టికీ క‌లుస్తూనే ఉంటాం కానీ వీరిద్దరికి తారక్ తో మాత్రం గ్యాప్ వచ్చిన మాట నిజం. అయితే వీరి మధ్య ఏం జరిగిందని నేనుప్పుడు అడగలేదు. కానీ వైసీపీలోకి వెళ్లాకే కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య మాటలు ఆగిపోయాయని చెప్పారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది ఎన్టీఆర్ కి బాగా తెలుసు. భవిష్యత్తులో వీరిద్దరూ మళ్ళీ కలుస్తారని ఇప్పుడే చెప్పలేం అని వినాయక్ అన్నారు.