Director Vwnu Udugula Special Bonam Tweet With Sai Pallavi Still Goes Viral
mictv telugu

బోనాల స్పెషల్.. సాయిపల్లవి ఫోటోను ట్వీట్ చేసిన డైరెక్టర్

July 24, 2022

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగలు బతుకమ్మ, బోనాలు. ముఖ్యంగా ఆషాడ మాసంలో వచ్చే బోనాల పండగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ జరుపుకుంటారు. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల వల్ల.. తెలంగాణ పండుగలు జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయి. చాలా సినిమాల్లో బోనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్‌ అయిన విరాటపర్వం సినిమాలో కూడా బోనాలకు సంబంధించిన సన్నివేశాలను డైరెక్టర్ వేణు ఊడుగుల తెలంగాణ ముఖ చిత్రాన్ని కండ్లకు కట్టినట్లుగా చూపించారు.

ఈ చిత్రంలో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన సాయిపల్లవి లంగా వోణిలో తెలుగుతనం ఉట్టిపడేలా బోనం ఎత్తుకొన్ని వచ్చే సన్నివేశాలు చాలా అందంగా అందరిని ఆకట్టుకున్నాయి. కాగా.. నేడు భాగ్యనగరంలో బోనాల సందడి ఉండటంతో.. విరాటపర్వం సినిమాలోని ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అంద‌రికీ #Happybonam అనే హ్యాష్‌ట్యాగ్‌తో డైరెక్టర్‌ వేణు ఊడుగుల‌ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. తెలంగాణ గ్రామీణ జీవన సంస్కృతికి, ప్రకృతికి, పర్వావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ ఇది.. తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక.. అంటూ ట్విట్‌ చేసారు వేణు. ఇప్పడు ఈ ట్విట్‌ నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతోంది. లంగావోణీలో సాయిపల్లవి బోనమెత్తుకుని వస్తున్న ఫోటోను చూసి అందరూ ఫిదా అవుతున్నారు.