దర్శక రత్న దాసరి ఇకలేరు... - MicTv.in - Telugu News
mictv telugu

దర్శక రత్న దాసరి ఇకలేరు…

May 30, 2017


ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు దాసరి నారాయణరావు (75) కిమ్స్ ఆస్పత్రిలో చిత్సపొందుతూ కన్నుమూశారు. జనవరిలో జరిగిన శస్త్రచికిత్స తర్వాత ఇన్‌ఫెక్షన్ సోకింది. తీవ్ర అస్వస్థతతో నాలుగు రోజుల క్రితం మరోసారి కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. హైబీపీతో బాధపడుతున్న దాసరికి వైద్యులు చికిత్స కొనసాగిస్తుండగా..కన్నుమూశారు. కిమ్స్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లోని స్వగృహానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. దాసరి మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు , చంద్రబాబునాయుడులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దర్శక రత్న దాసరి మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతికి సంతాపంగా బుధవారం షూటింగ్ లు బంద్ చేయనున్నారు.