Disable woman marries Lord Krishna in Gwalior, fulfills wish of bed-ridden daughter
mictv telugu

కూతురిని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లిచేసిన తండ్రి

November 11, 2022

Disable woman marries  Lord Krishna in Gwalior, fulfills wish of bed-ridden daughter

అలనాడు మీరాబాయి శ్రీష్ణుడే తన సర్వస్వమని నిత్యం భక్తిలో మునిగిపోయేదని చెప్తారు. కృష్ణుడిపై ఇలాంటి మరెన్నో ప్రేమకథలు ఉన్నాయి. తనను ప్రేమించినవారికి ఆయన అన్యాయం చేయడని భక్తుల విశ్వాసం. దిక్కులేని వారికి ఆయనే దిక్కు అంటారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ దివ్యాంగురాలికి కూడా ఆయనే దిక్కడయ్యాడు. ఆమెను పెళ్లాడ్డానికి ఎవరూ ముందుకు రావడంతో తండ్రి ఆమెను శ్రీకృష్ణుడికి ఇచ్చి అంగరంగవైభవంగా పెళ్లి జరిపించాడు. ఆలయంలో ఓ అమ్మాయికి కృష్ణుడి వేషం కట్టించి సంప్రదాయబద్ధంగా తంతు జరిపించాడు.

శివపాల్ రాథోడ్ అనే వ్యాపారి కూతురు సోనాల్ మూగ, చెవిటి. నవడలేదు కూడా. మంచానికే పరిమితమైన ఆమెకు ఎవరో ఒకరు దొరికితే పెళ్లిచేయాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. అయితే ఏ యువకుడూ ముందుకు రాలేదు. కూతురి బాధ, బంధువులు సూటిపోటి మాటలతో శివపాల్ ఎంతో మనోవేదన పడ్డాడు. ఊరికే బాధపడుతూ కూర్చుంటే సరిపోదని, తన కూతురి పెళ్లిని దేశమంతా ఘనంగా చెప్పుకోవాలని ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకన్నాడు. తన కూతురి పెళ్లి నిశ్చయమైందని, అందరూ రావాలని బంధుమిత్రులకు ఫోన్లు చేశాడు. వరుడు ఎవరి వారు ఆరా తీయగా శ్రీకృష్ణుడని చెప్పడంతో అవాక్కయ్యారు. కూతురిపై అతని ప్రేమను మెచ్చుకుని పెళ్లికి హాజరయ్యారు. పెళ్లిని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మెహందీ, ఊరేగింపు నిర్వహించిన మంచి భోజనం పెట్టారు. ఇక తన కూతురి భారమంతా అ కృష్ణభగవానుడిదేనని శివపాల్ చెప్పారు.