70 ఏళ్ల దివ్యాంగుడు.. ఏపీ నుంచి యూపీకి ఇలా..  - MicTv.in - Telugu News
mictv telugu

70 ఏళ్ల దివ్యాంగుడు.. ఏపీ నుంచి యూపీకి ఇలా.. 

May 26, 2020

లాక్‌డౌన్‌లో వలస కూలీల దుస్థితికి అద్దం పెట్టే మరో విషాదం ఇది. 70 ఏళ్లు దాటిన దివ్యాంగుడు ప్రాణాలు నిలుపుకోడానికి తన త్రిచక్రవాహనంలో ఏపీ నుంచి యూపీకి వెళ్తున్నాడు. ఎర్రటి ఎండలో యువకులే శోష వచ్చి పడిపోతున్న నేపథ్యంలో ఆయన అన్నింటికీ తెగించి ముందుకు సాగుతున్నాడు. 

రాంసింగ్ అనే వృద్ధుడు యూపీ నుంచి రాజమండ్రికి వలస వచ్చాడు. సెంటు సీసాలు అమ్ముతూ పొట్టపోసుకునేవాడు. లాక్ డౌన్ వల్ల అది వీలుకాలేదు. దీంతో తిరిగి యూపీలోని సొంత ఊరుకు బయల్దేరాడు. రైళ్లు వేశారని ఎవరో చెప్పారని, కానీ ఎలా వెళ్లాలో తెలియకపోవడం, ఎక్కడికి వెళ్లాలన్న తన బండి అవసరం కావడంతో రోడ్డు వెంబడి సాగుతున్నానని చెప్పాడు. నాలుగు రోజుల కిందట రాజమండ్రి నుంచి బయల్దేరిన ఆయన ప్రస్తుతం అనకాపల్లి దాటాడు. విషయం తెలుసుకున్న శశిధర్‌ శశిథర్ అనే డాక్టర్ అతనికి దారిఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి పంపారు. ఏపీలో ఏ వలస కార్మికుడూ నడుస్తూ కనిపించకూడదని, బస్సులు వేయాలని సీఎం జగన్ చెప్పినా వేలమంది నడుస్తూనే కనిపిస్తున్నారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి.