యాదాద్రిలో అపశ్రుతి.. మంత్రిపై తేనెటీగలు దాడి - MicTv.in - Telugu News
mictv telugu

యాదాద్రిలో అపశ్రుతి.. మంత్రిపై తేనెటీగలు దాడి

March 28, 2022

trg

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌‌పై తేనెటీగల దాడి చేసిన ఘటన యాదాద్రిలో చోటుచేసుకుంది. సోమవారం యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పునః ప్రారంభం కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతోపాటు, మంత్రులు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో పాల్గొన్న ఆయనపై, వేద పండితులపై, మంత్రి వ్యక్తిగత సిబ్బందిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో మంత్రితోపాటు పలువురు వేద పండితులు, సిబ్బంది గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా అక్కడున్న పూజారులు మాట్లాడుతూ..’ఉదయం 11:45 గంటల సమయంలో స్వామివారి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పువ్వాడ అజయ్ కుమార్‌ కూడా పాల్గొన్నారు. స్వామివారి పూజాలో నిమగ్నమైన మంత్రిపైకి ఒక్కసారిగా తేనెటీగలు దూసుకొచ్చాయి. అయినా వాటి దాడిని పట్టించుకోకుండా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భక్తి భావంతో మహాకుంభ సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు” అని తెలిపారు. పూజా అనంతరం మంత్రిని ప్రాథమిక చికిత్స కోసం పూజా హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పార్టీ సభ్యులు తెలిపారు.