కాంగ్రెస్‌కు ఊర్మిళ గుడ్‌బై
బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆరు నెలలు తిరగకుండానే ఆ పార్టీని వీడటం మహారాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు తోడు నాయకత్వ లోపం, అంతర్గత కలహాలతో విసుగుచెంది ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఊర్మిళ ప్రకటించారు.
ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దియోరాతో తాను పంచుకున్న విశ్వసనీయ సమాచారం కూడా బయటకు రావడంతో తాను అసంతృప్తి చెందానని చెప్పారు. ముంబైలో తన ఓటమికి పార్టీలోనే కొన్ని వర్గాలు పనిచేశాయని ఊర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ముంబై నుంచి పోటీ చేసిన ఊర్మిళ బీజేపీ సీనియర్ నేత గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆయన నాలుగు లక్షల యాభైవేల ఓట్ల మెజారిటీతో గెలిపొందారు.