పాక్‌తో యుద్ధానికి భారత ముస్లిం సైనికులు నో అన్నారా? మళ్లీ దుమారం! - MicTv.in - Telugu News
mictv telugu

 పాక్‌తో యుద్ధానికి భారత ముస్లిం సైనికులు నో అన్నారా? మళ్లీ దుమారం!

October 15, 2020

Disbanded muslim regiment news

1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంపై మళ్లీ దుమారం రేగింది. ఆ సమయంలో భారత ఆర్మీలోని కొందరు ముస్లిం సైనికులు తాము పాకిస్తాన్‌తో యుద్ధం చేయడానికి నిరాకరించారని, దీంతో సదరు ‘ముస్లిం రెజిమెంట్’ను రద్దు చేశారని సోషల్  మీడియాంలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మాజీ సైనికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాన్ని అరికట్టాలంటూ 120 మంది రిటైర్డ్ జవాన్లు ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్‌లకు లేఖ రాశారు. 

ముస్లిం రెజిమెంట్’ ప్రచారం 2013 నుంచే జరగుతోంది. తాజాగా మళ్లీ చెలరేగడతో మాజీ సైనికులు స్పందించారు. ‘దాని వల్ల మన సైనికులు నైతిక స్థైర్యం దెబ్బుతింటుంది. దేశంలో మత విద్వేషాలు చెలరేగే ప్రమాదముంది. అసలు భారత ఆర్మీలో ‘ముస్లిం రెజిమెంట్’ అనేదే లేదు. లేని దాన్ని రద్దెలా చేస్తారు? ఈ దుష్ప్రచారం వల్ల జాతీయ భద్రతకు విఘాతం కలుగుతుంది.. ’ అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ఎందరో ముస్లిం జవాన్లు ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. హవల్దార్ అబ్దుల్ హమీద్‌కు పరమవీర చక్ర పురస్కారం ప్రకటించారని, మేజర్ అబ్దుల్ రఫీ ఖాన్ స్వయంగా పాక్ సైన్యంలో పనిచేసిన తన మామైనే యుద్ధం చేసి అమరుడుయ్యాడని వివరించారు. లేఖపై ఆర్మీ, నేవీ, వాయుసేన మాజీ అధికారులు సంతకాలు చేశారు.