ఏపీలో ఆరవై ఏళ్లు దాటిన వారికి రాయితీ: పేర్ని నాని - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఆరవై ఏళ్లు దాటిన వారికి రాయితీ: పేర్ని నాని

March 16, 2022

ap

ఆంధ్రప్రదేశ్‌లో ఆరవై ఏళ్లు దాటిన వారికి ఆర్టీసీ టికెట్ ధరలో 25 శాతం రాయితీని ఇవ్వబోతున్నామని.. రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. గతంలో కొవిడ్ కారణంగా నిలిపివేసిన ఈ రాయితీని సీనియర్ సిటిజన్లకు వచ్చే నెల నుంచి పునరుద్ధరిస్తున్నట్టు బుధవారం ఆయన తెలిపారు. వయసు నిర్ధారణ కోసం ఆధార్, ఓటరు ఐడీ తదితర ఏదైనా గుర్తింపు కార్డును చూపించి రాయితీ పొందవచ్చని అన్నారు.

ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ”ఇక ఇతర శాఖల మాదిరే ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలను చేపడతాం. 1,800కు పైగా కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించాం. ఆర్టీసీ బస్సులకు బయటి బంకుల నుంచి పెట్రోల్ కొనుగోలు చేయాలని నిర్ణయించాం. దీనివల్ల ఆర్టీసీకి రోజుకు రూ. 1.50 కోట్లు ఆదా అవుతుంది. తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి-మదనపల్లి, తిరుపతి-నెల్లూరుకు ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతాం” అని ఆయన స్పష్టం చేశారు.