సహజ ఉప్రగ్రహం, చంద్రుడి తర్వాత అంతటి ప్రకాశవంతమైన జాబిల్లిపై నెర్రులు విచ్చుతున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు. నెమ్మదిగా ఆ పగుళ్లు విస్తరిస్తూనే ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రహాలు, ఉల్కల నుంచి వెలువడే అంతరిక్ష వ్యర్థాలు చంద్రుడిపై పేరుకుపోయినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చందమామ ఉపరితలంపై ఉండే వాతావరణాన్ని ఎక్సోస్పియర్ అంటారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఈ అంశంపై విస్తృతంగా ప్రయోగాలు చేస్తోంది. అపోలో17 స్పేస్ క్రాఫ్ట్ సెన్సార్ల ద్వారా చంద్రుడి ఉపరితలంపై లోపాన్ని ఈ సంస్థ అధ్యయనం చేస్తోంది. పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేశాకే ఇందుకు కారణాలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు.
చంద్రుడిపై ఏర్పడ్డ శక్తిమంతమైన భూకంపం కారణంగా వింత పగుళ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఆ షాక్ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5 కి దగ్గరగా ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. చంద్రుడిపై పగుళ్ల తీవ్రత భూమిపై భవనాలను నేలకూల్చడంతో పాటు మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగించగలదని అంటున్నారు. జాబిల్లి ప్రభావం మన గ్రహంపై ఎంతగానో ఉంటుందని అంటున్నారు. ఇది భూమి చలనాన్ని ప్రభావితం చేస్తుందని.. మన వాతావరణాన్ని స్థిరీకరించడానికి సహాయపడుతుందని తెలిపారు. ఇంతలా భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న చంద్రుడిపై శాటిలైట్ ప్రయోగాలకు కేంద్రంగా చేసుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతలో చంద్రుడిపై పగుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు. కాగా, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు ఏర్పడతాయి. రోజులు, నెలలను గుర్తించడానికి కూడా చందమామ సాయం చేస్తుంది. ఆకాశంలో దాని ఉనికి ద్వారానే క్యాలెండర్‌ను రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, తెగలు రూపొందించుకున్న అన్ని రకాల క్యాలెండర్లకు చంద్రుడే మూలం అన్న విషయం తెలిసిందే. జాబిల్లి వయసు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాలని పరిశోధనలు తేల్చాయి. ఇది దాదాపు భూమికి సమానమైన వయస్సు. చంద్రుని ఉపరితలం చాలా వరకు రాళ్లు, గుట్టలతో నిండి ఉంటుంది.