చనిపోయాడని అంత్యక్రియలు కూడా చేశారు.. బతికొచ్చాడు! - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోయాడని అంత్యక్రియలు కూడా చేశారు.. బతికొచ్చాడు!

November 17, 2019

చిన్నపిల్లలను ఎత్తుకుపోతున్నాడని జనం కొట్టి చంపారు. అంత్యక్రియలు కూడా ముగిశాయి. మూడు నెలలు గడిచిపోయాయి.కోలుకోలేని విషాదమే అయినా భార్య, బంధువులు దుఖ్కాన్ని దిగమింగుకుని జీవనయానంలో పడిపోయారు. ఇంతలో చనిపోయాడనుకున్న మనిషి ఇంటికి నవ్వుకుంటూ తిరిగి వచ్చాడు! బిహార్‌లోని పట్నా జిల్లా నిసార్‌పురా గ్రామంలో జరిగిందీ వింత!

Diseased man.

చిన్నపిల్లలను ఎత్తుకుపోతున్నాడని ఈ ఏడాది ఆగస్టులో హమత్పూర్ ప్రాంతంలో గ్రామీణులు ఓ వ్యక్తిని కొట్టి చంపారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. బట్టల ఆధారంగా అతణ్ని కృష్ణ మాంజీ అనే స్థానికుడిగా గుర్తించారు. మాంజీ భార్య కూడా అది తన భర్త మృతదేహమే అనుకుంది. అంత్యక్రియలు పూర్తయ్యాయి.మూడు నెలలు గడిచాక.. ఇటీవల పుణేలో పనిచేస్తున్న అసలు ‘కృష్ణ మాంజీ’కి తెలిసింది. తాను చనిపోలేదని చెప్పడానికి అతడు ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు ఆనందంతో అతణ్ని అక్కున చేర్చుకున్నారు. భార్య మీడియాతో మాట్లాడుతూ..‘నేను ఆ రోజు మృతదేహాన్ని సరిగ్గా చూడలేదు. బట్టలు నా భర్తవే అని జనం చెప్పడంతో అవుననుకున్నాను..’ అని చెప్పింది. మాంజీ బతికే ఉన్నట్లు తెలియడంతో మూక దాడిలో  చనిపోయింది ఎవరో గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.