దిశ  బిల్లుకు కేబినెట్ ఓకే.. రేప్ కేసుల్లో 21 రోజుల్లోనే శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

దిశ  బిల్లుకు కేబినెట్ ఓకే.. రేప్ కేసుల్లో 21 రోజుల్లోనే శిక్ష

December 11, 2019

Disha 0222

అంధ్రప్రదేశ్ మంత్రివర్గం సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. అత్యాచార కేసుల్లో దోషులకు కేవలం 21 రోజుల్లోనే మరణ శిక్ష విధించేలా తీసుకొచ్చిన బిల్లుకు పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమిలన్‌ లా చట్టం 2019- ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనెట్ ఉమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019 బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిది. దీనికి క్లుప్లంగా దిశ చట్టం అని పేరు పెట్టారు. ఐపీసీలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చారు. 

ఈ బిల్లును కేబినెట్ ఆమోదించగానే చట్టంగా మారుతుంది. బిల్లులోని ప్రతిపాదనల ప్రకారం.. అత్యాచార కేసుల్లో ఆధారాలు ఉంటే 21 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. వారం రోజుల్లోనే దర్యాప్తు ముగించాలి. మరో 14 రోజుల్లో విచారణ జరిపి, మొత్తంగా 21 రోజుల్లో తీర్పు వచ్చేయాలి. దీనికోసం నిబంధనలు సవరించారు. ప్రస్తుతం 4 నెలలుగా ఉన్న విచారణ సమయాన్ని 21 రోజులకు కిదించారు. అత్యాచారాలతోపాటు, లైంగిక వేధింపులు యాసిడ్‌ దాడుల కేసుల విచారణ కోసం ప్రతి జిల్లాలో ఒక కోర్టును ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులకు పాల్పడే వారికి కూడా కఠిన శిక్షలు పడతాయి. తొలి తప్పు కింద రెండేళ్ల జైలు శిక్ష్, రెండో తప్పుకు నాలుగేళ్లు జైలుశిక్ష పడుతుంది. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే ప్రస్తుతం గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుండగా కొత్త చట్టంతో దాన్ని ఏడేళ్లకు పెంచారు.