అంత్యక్రియలు మళ్లీ వాయిదా.. శుక్రవారం వరకు ‘గాంధీ’లో - MicTv.in - Telugu News
mictv telugu

అంత్యక్రియలు మళ్లీ వాయిదా.. శుక్రవారం వరకు ‘గాంధీ’లో

December 9, 2019

Disha case

దిశ కేసు నిందితుల అంత్యక్రియలు మళ్లీ వాయిదాపడ్డాయి. ఈరోజు(సోమవారం)వరకు వారి మృతదేహాలను భద్రపరిచాలని ఆదేశించిన హైకోర్టు.. కేసు విచారణ సాగుతోంది కనుక శుక్రవారం(ఈ నె13) వరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో భద్రతపరచాలని పోలీసులను ఆదేశించింది. 

ఎన్‌కౌంటర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై కోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ కేసులో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాటించామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పగా, అయితే అందుకు ఆధారాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.  సుప్రీం కోర్టులోనూ విచారణ జరగుతుతున్నందున ఈనెల 12కు వాయిదా వేసింది. కేసులో సలహాలు తీసుకోడానికి సీనియర్ అడ్వొకేట్ ప్రకాశ్ రెడ్డిని కోర్టు అమికస్ క్యూరీ (మధ్యవర్తి)గా నియమించింది. ఇదిలా ఉండగా.. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేసి, శిక్షించాలని సుప్రీం కోర్టులో సుచిత్ర మొహంతీ అనే మహిళా జర్నలిస్టు పిటిషన్ వేశారు. దీనిపై 11న విచారణ జపుతామని కోర్టు తెలిపింది. మృతదేహాలను త్వరగా బంధువులకు అప్పగించేందుకు అనుమతివ్వాలని, మహబూబ్ నగర్ ఆస్పత్రి మార్చురీలో వాటిని భద్రపరిచే సదుపాయాలు లేవని పోలీసులు చెప్పడం తెలిసిందే. ప్రస్తుతం వాటిని మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో భద్రపరిచారు.