ఫోటోగ్రాఫర్‌ను తోసేసిన హీరోయిన్ బాడీగార్డ్..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ఫోటోగ్రాఫర్‌ను తోసేసిన హీరోయిన్ బాడీగార్డ్..వీడియో

February 24, 2020

fgnjhnh

సినీ తారలు ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుంటారు. అయితే కొందరు ఫొటోగ్రాఫర్ల ప్రవర్తన సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంది. తాజాగా బాలీవుడ్‌ నటి దిశా పటానికి ఇలాంటి సంఘటనే ఎదురైంది.

ఓ చోటుకు వెళ్లిన దిశాను తన బాడీగార్డ్‌ కారు వద్దకు తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా కారు డోర్‌ వద్దకు ఓ ఫోటోగ్రాఫర్‌ వచ్చి ఆమెను ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన బాడీగార్డ్‌ అతన్ని అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన కొనసాగింది. దీంతో బాడీగార్డ్.. ఫోటోగ్రాఫర్‌ను తోసేసాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే దిశా పటానీ మేనేజర్‌ సదరు ఫోటోగ్రాఫర్‌కు క్షమాపణలు చెప్పడంతో కథ సుఖంతమైనది.