నలుగురిని ఎన్‌కౌంటర్ చేసినా... పాతబస్తీలో బాలిక కిడ్నాప్.. తిరుపతిలో మైనర్‌పై గ్యాంగ్‌రేప్ - MicTv.in - Telugu News
mictv telugu

నలుగురిని ఎన్‌కౌంటర్ చేసినా… పాతబస్తీలో బాలిక కిడ్నాప్.. తిరుపతిలో మైనర్‌పై గ్యాంగ్‌రేప్

December 8, 2019

Dishan case woman issue.

దిశ కేసు నిందితుల కాల్చివేత ప్రభావం చూపడం లేదు. మహిళలపై నేరాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదారాబాద్ చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఓ యాచకురాలి బిడ్డ కిడ్నాప్ అయింది. చిత్తూరు జిల్లాలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరివిస్తోంది. 

మెదక్‌ జిల్లా పాపన్నపేట్‌ గ్రామానికి చెందిన షేక్‌ వలీ, కె.సునీత కొన్నాళ్లుగా పాతబస్తీ చాంద్రాయణగుట్టలో పిల్లలతో కలసి ఫ్లైఓవర్ కింద జీవిస్తున్నారు. షేక్‌వలీ కూలి పనులు చేస్తుండగా, సునీత భిక్షాటన చేస్తోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆమె కల్లు కోసం పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లింది. తిరిగిరాగా నాలుగేళ్ల కూతురు పల్లవి కనిపించలేదు. భర్తతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మరోపక్క.. తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడి గ్రామ సమీపంలో ఓ మైనర్ బాలికను ఇద్దరు యువకులు కాటేశారు. బస్సు కోసం వేచి చూస్తున్న బాలికను వెంకటేశ్ అనే యువకుడు ప్లాన్ ప్రకారం లిఫ్ట్ ఇస్తానని తీసుకెళ్లాడు. దారి మధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోల్ అయిపోయిందని బండి ఆపాడు. తన స్నేహితుడు రాజమోహన్ నాయక్ కు ఫోన్ చేసి పెట్రోల్ తీసుకురమ్మన్నాడు. అతని మాటలు నిజమేనేమో అనుకుని బాలిక అక్కడే ఉండిపోయింది. కాసేపటి తర్వాత రాజమోహన్ అక్కడి వచ్చాడు. వెంకటేశ్, రాజమోహన్ బాలికపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో తిరుచానూరు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.