Dismissal of 6 parties in AP, 2 in Telangana: ECI
mictv telugu

ఏపీ: 6 పార్టీలను తొలగించిన ఈసీఐ..అవి ఇవే..

September 14, 2022

కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపులేని ఆయా పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో పలు పార్టీలను తొలగించింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు పార్టీలు ఉన్నాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించగా, ఉనికిలోలేని 253 పార్టీలను క్రియారహిత ఆర్‌‌యూపీపీలుగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరింది.

”ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీలను (ఆర్‌యూపీపీ)లను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) జాబితా నుంచి తొలగించింది. మే 25న ఆర్‌ యూపీపీల విధివిధానాలను అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. ఉనికిలోలేని 253 పార్టీలను క్రియారహిత ఆర్‌ యూపీపీలుగా ప్రకటించింది. ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరింది.” అని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ‘పార్టీ రిజిస్టర్ అయిన ఐదేళ్లలోపు ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో పోటీచేయాలి. ఆ తర్వాత పోటీచేయడం కొనసాగించాలి. పార్టీ ఆరేళ్లపాటు ప్రతి ఎన్నికల్లో పోటీచేయకపోతే రిజిస్టర్ పార్టీల జాబితా నుంచి పార్టీ తొలగించబడుతుంది’ అని తెలియజేసింది. ఇక, ఇప్పటివరకు ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన ఆర్ యూపీపీల సంఖ్య 284కు చేరింది.

ఇక, ఏపీలో తొలగించినబడిన పార్టీలు ఇవే..

1. ఆలిండియా ముత్తాహిదా ఖ్వామి మహాజ్,
2. భారత దేశం పార్టీ,
3. ఇండియన్స్ ఫ్రంట్,
4. జాతీయ తెలుగు అభివృద్ధి సేవాసమూహం,
5. మన పార్టీ,
6. ప్రజాభారత్ పార్టీ.